పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని దానివల్ల ఆక్సిజన్ వంటి ప్రాణవాయువుని మనం పొందొచ్చని తెలిపారు అంతేకాకుండా ప్రతి మనిషికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఎంత ముఖ్యమో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి ముందు ఒక మొక్క కూడా ఉండటానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు అంతేకాకుండా ఇంటి ముందు మొక్కలు లేకుండా చేసి ఈ మధ్యకాలంలో సిమెంట్తో గచ్చులు వేస్తూ ఎంతోమంది స్వచ్ఛమైన గాలికి దూరమై కాలుష్యం ఎక్కువై కార్బన్డయాక్సైడ్ శాతం ఎక్కువ అనారోగ్యం పాలవుతున్నారని కావున ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి ఆ మొక్కల్ని తమ స్నేహితుల్లా భావించి ప్రతిరోజు నీళ్ళు పోసి మొక్కల్ని కూడా తమ పిల్లల్లా చూసుకొని కార్బన్డయాక్సైడ్ ఎక్కువ అవ్వకుండా కాలుష్యాన్ని నివారించవచ్చని పర్యావరణాన్ని పరిరక్షించచ్చని మహిళలకు సూచించారు అనంతరం ఇంటింటికి మహిళలతో మొక్కలు నాటించారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి నాయకులు కుసుమ ఏసు స్వాతి కుమార్ అమ్మ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు


