పార్వతీపురం మన్యం జిల్లా
మక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందిన ఘటన దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పార్వతీపురం కు చెందిన వెత్స అఖిల(20) కు దెబ్బగడ్డ గ్రామం కు చెందిన భాస్కరరావుకు శుక్రవారం రాత్రి 10 గంటలకు వివాహం జరిగింది.
వివాహ అనంతరం నిద్రించిన వధువు అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు మక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కొరకు సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించమని సూచించారు. కుటుంబ సభ్యులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మార్గమధ్యలోనే చనిపోయిందని తెలియజేశారు.
పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కారణలు తెలియజేస్తామన్నారు.
ఇంట్లో శుభకార్యం జరిగిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడంతో కుటుబసభ్యులలో విషాదం అలుముకుంది.