చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి పట్టణం లో20ఏళ్ల క్రితం కాలనీ వాసులకు నీటి ఎద్దడ లేకుండా ఏర్పాటు చేసిన చేతి బోర్ పంపు ను కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు, తొలగించిన ప్రదేశంలో ఆ ఆసామి ట్రాక్టర్, ఆటో,టాటా ఎస్,వాహనాలు నిలుపు స్థలం గా ఏర్పాటు చేస్తున్నా విషయంపై, ప్రశ్నించిన కాలనీవాసులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితులు స్థానిక చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ను కలసి తమ సమస్య ను వినిపించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన శ్రీనివాసరావు గారు గరివిడి ఎం.పీ.డీ.వో గారిని మరియు ఈ.ఓ గారిని సదరు విషయమై వివరణ కోరగా , ఇప్పటికే దానిపై కంప్లైంట్ ఫైల్ చేసి పోలీసు వారికి అందించడం జరిగిందని తెలిపారు , ఈ విషయమై స్థానిక ఎస్.ఐ గారిని కలిసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు, తక్షణమే రెండు రోజుల్లో చేతి పంపు ఏర్పాటుచేసి కాలనీవాసులకు మంచినీటి ఎద్దడిని తీర్చవలసిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక గరివిడి జనసేన పార్టీ నాయకులు సిగ తవిటినాయుడు , ఎడ్ల రమణ మరియు జన సైనికులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా