సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     

సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     

                                                                                                                                                                                                                                                                                                                          ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్నదొర  ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైయస్సార్,సుభాష్ చంద్రబోస్, బొర్రా.చిన్నా గారి విగ్రహాలకు ముందుగా పూలమాలలు వేసి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళులర్పించారు.అనంతరం వైసిపి శ్రేణులు,అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి కేక్ కట్ చేశారు. పేదలకు రగ్గులు,చీరలు పంపిణీ చేశారు. అనంతరం రాజన్నదొర  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంతా మాయాజాలం అని,ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని,కూటమి ప్రభుత్వం వారు మాటలు చెప్తున్నారు కానీ పనులు చేయట్లేదని ప్రజలు ప్రశ్నించాలన్నారు.ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదలకు కాలకూట విష ప్రభుత్వంలా తయారయిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాలూరు,పాచిపెంట, మెంటాడ మండల తాజా,మాజీ ప్రజాప్రతినిధులు,వైసిపి అనుబంధ విభాగాల చైర్మన్లు,వైస్ చైర్మన్లు సభ్యులు,వైసిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి