డీ సిర్లం గ్రామం ఆశా వర్కర్ గా పనిచేస్తున్న పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ……
పార్వతీపురం మన్యం జిల్లా…
సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డీ సిర్లాం గ్రామానికి చెందిన పొందూరు జోత్స్న తన తల్లి పొందూరు విద్యావతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ మాధవ రెడ్డికి ఫిర్యాదు చేశారు
అనంతరం జోత్స్న మీడియాతో మాట్లాడుతూ
దళిత మహిళ అయిన మా అమ్మగారి మృతికి కారణమైన టిడిపి నాయకుడు డాకేటి గౌరీ నాయుడు పై చర్యలు తీసుకోవాలని
తన తల్లి విద్యావతి ఆశ వర్కర్ గా పనిచేసేదని… మక్కువ చెందిన టిడిపి రాజకీయ నాయకుల కుల వివక్షతో మరణించిందని ఆవేదన వ్యక్తం చేసింది
తన తల్లి ఫిట్నెస్ బాగోలేదని వైద్యాధికారులు తన తల్లిని విధులు నిర్వహించనివ్వలేదు
తన తల్లి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి వైద్యాధికారులకు ఇచ్చినా తీసుకోలేదు
అందువల్ల తన తల్లి విద్యావతి ఎన్నిసార్లు అధికారులకు, మంత్రి సంధ్యారాణి కి మొరపెట్టుకున్నా తన ఉద్యోగం తనకు ఇవ్వలేదు అని బాధపడి, మానసిక క్షోభకు గురై మృతి చెందింది
స్థానిక టిడిపి నాయకుడు గౌరు నాయుడు తన తల్లిపై కుల వివక్ష చూపి ఉద్యోగం చేయనివ్వకుండా అడ్డుకున్నారు
తన తల్లి మరణానికి కారణమైన వారిపై దళిత వర్గానికి చెందిన తన కుటుంబానికి న్యాయం చేయాలని కన్నీరు మున్నేరయ్యారు మొరపెట్టుకుంది

