*క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు విజయనగరం మహారాజ పాలిటెక్నిక్ కళాశాలలో “ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2025-26” వారి ఆధ్వర్యంలో జరిగిన రీజినల్ మీట్ క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు వారిని ప్రత్యేకంగా అభినందించి,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రీడలు శరీరానికే కాదు, మనస్సు,వ్యక్తిత్వం,సామాజిక జీవనానికి కూడా ఎంతో మేలు చేస్తాయిని తెలిపారు.అలాగే సహకారం,నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయిని తెలియజేశారు.మరియు ఒత్తిడి,ఆందోళన తగ్గుతాయి.ఏకాగ్రత,జ్ఞాపకశక్తి పెరుగుతాయి,అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మా కాలేజీ వ్యాయామ ఉపాధ్యాయులచే మరింతగా తర్ఫీది ఇచ్చి స్టేట్ లెవెల్ పోటీలకు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వ్యాయామ ఉపాధ్యాయులు సి.హెచ్ శంకర్రావు,సి.హెచ్ హేమ,టి.వి.సోంబాబు,వివిధ విభాగాధిపతులు,తదితరులు పాల్గొన్నారు.
*వివిధ కేటగిరీల్లో గెలుపొందిన విద్యార్థుల వివరాలు*:
1)షాట్ పుట్ విభాగంలో ఎస్. నోలిని కు ప్రథమ స్థానం.
2)లాంగ్ జంప్ బాయ్స్ సింగిల్ విభాగంలో జె.పాలు కు ప్రథమ స్థానం.
3)రన్నింగ్ 800 మీటర్స్ బాయ్స్ విభాగంలో బి.షణ్ముఖాన్ కు ప్రథమ స్థానం.
4) ట్రిపుల్ జంప్,హై జంప్ విభాగాల్లో జి.నరసింహ కు ద్వితీయ స్థానం.
5)రిలే(100×4)బాయ్స్ విభాగంలో జె.పాలు,షణ్ముఖ్,కే.జీవన్ కుమార్,ఎన్.జస్వంత్ కుమారులకు ద్వితీయ స్థానం.
6) షటిల్ గర్ల్స్ డబుల్స్ విభాగంలో యు.శిరీష,వి.శ్రీదేవి లకు ద్వితీయ స్థానం.
6) కోకో గర్ల్స్ విభాగంలో బి.పావని& టీమ్ కు ద్వితీయ స్థానం.
8) వాలీబాల్ బాయ్స్ విభాగంలో కె.జీవన్ కుమార్&టీమ్ కు ద్వితీయ స్థానం.
10) కబడ్డీ బాయ్స్ విభాగంలో పి.రాజు & టీమ్ కు తృతీయ స్థానం.
11) రిలే (400×4) బాయ్స్ విభాగంలో ఎస్.పృద్వి టి.గణేష్,ఏన్.జస్వంత్,వి. అజయ్ లకు తృతీయ స్థానం.
12)100 మీటర్ల రన్నింగ్ విభాగంలో జె.పాలు కు తృతీయ స్థానం సాధించారు.



