







తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గ్రీవెన్స్ డే – ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: కిమిడి కళావెంకటరావు గారు
చీపురుపల్లి,డిసెంబర్26,
తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఈరోజు తన కార్యాలయంలో ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించారు. ఉదయం నుండే నియోజకవర్గంలోని వివిధ గ్రామల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి, తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలను సమర్పించారు.
అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కళావెంకటరావు గారు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మాట్లాడుతూ, ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తామని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గారు తెలిపారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
