డాక్టర్ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు,
ఉదయ అక్షరం గరివిడి జనవరి 1:
గరివిడి పట్టణంలోని బొత్స కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయరాలు, యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష సమక్షంలో నియోజకవర్గ స్థాయి నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి అనూష కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య డాక్టర్ బొత్స అనూష కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం పార్టీ శ్రేణులు ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. రాబోయే కాలంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో కేవీ సూర్యనారాయణ రాజు (పులిరాజు), మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిరువురు రమణరాజు (పెదబాబు), బొత్స సత్యనారాయణ సోదరి ఊటపల్లి గ్రామ సర్పంచ్ చాణక్య లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్రామ స్థాయి సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా సభ్యులు మరియు అభిమానుల రాకతో గరివిడి బొత్స కార్యాలయం జనసంద్రాన్ని తలపించింది. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిన ఈ వేడుకలు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోయాయి.





