పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ICDS ప్రాజెక్టు p. కోనవలస సెక్టార్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ ను సాంప్రదాయబద్ధంగా అలంకరించి సెంటర్ ముంగిట రంగుల ముగ్గులు వేసి పిల్లలతో వారి తల్లులతో భోగిమంట చుట్టూ కోలాటం ఆడుతూ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట ఐసిడిఎస్ పిఓ అనంత లక్ష్మి మరియు సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.









