పార్వతీపురం మన్యం జిల్లా….
అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ.
వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన అభ్యర్థినిగా బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీతను నియమించగా గతంలో ఈమె వైయస్సార్ పార్టీ తరఫున ఎంపీగా 2014లో పోటీ చేసి గెలుపొందారు అప్పుడు గెలుపొందినప్పటి నుంచి కనీసం పార్లమెంటరీ స్థానంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకో పోవడంతో కనీసం ఆ గిరిజన ప్రాంతాల వైపు కూడా ఆవిడ ముఖం చూపించకపోవడంతో ప్రజల్లో ఈవిడ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. కనీసం ఆవిడ ఓ దప్ప ఎంపీగా పోటీ చేసి గెలుపొంది అభ్యర్థి అయినప్పటికీ నేటికీ కొత్తపల్లి గీత అంటే గిరిజన గ్రామాల్లో ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గిరిజన గ్రామాల్లో ప్రజలు,గిరిజన సంఘనాయకులు బిజెపి అధిష్టానం కొత్తపల్లి గీతాను అభ్యర్థిగా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ అభ్యర్థిగా ఉన్న కొత్తపల్లి గీత గతంలో చేసింది ఏమీ లేదు, నేడు అటువంటి అభ్యర్థిని కి ఎలా కేంద్ర ప్రభుత్వం టికెట్ ఖరారు చేసిందని, ఆవిడ ఓ గిరిజన మహిళ కాదని, ఆవిడ అధిష్టానం ఇకనైనా సమూచితమైన నిర్ణయం తీసుకొని, ఆవిడకి బదులుగా వేరే ఎవరినైనా అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పనిసరిగా ఓటు వేసి గెలిపిస్తాం. కొత్త పల్లి గీతనే అధిష్టానం టికెట్ ఖరారు చేసి ప్రకటిస్తే మాత్రం తనకి ఓటు వేయమని గిరిజనులు వారిలో ఉన్న భావోద్వేగాన్ని తెలియజేస్తున్నారు.