విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళును అపహరించిన నేరస్థుడు విజయనగరం పట్టణం, సుంకరి వీధిలో నివాసం ఉంటున్న గుమ్మడి ఆదినారాయణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఫిబ్రవరి 25న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళుచోరీకి గురవుతున్నాయని, వీటికి కారకులైన వారిని అరెస్టు చేసేందుకు నిఘా పెట్టామన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో పోలీసు వారిచే ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ఫుటేజి ద్వారా నిందితుడిని గుర్తించి బాబామెట్ట వద్ద నిందితుడు గుమ్మడి ఆదినారాయణను 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసామన్నారు. రికవరీ చేసిన మోటారు సైకిళ్ళు విలువ సుమారు రూ. 2.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడు గుమ్మడి ఆదినారాయణ శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, చిల్లపేట గ్రామానికి చెందినవాడని, గత 6 సం.ల నుండి విజయనగరం పట్టణం సుంకరి వీధిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడని, ఇతను డ్రైవరుగా పనిచేస్తూ, హేండిల్ లాక్ వేయని మోటారు సైకిళ్ళును నడిపించుకొని తెసుకోనిపోయి వాటిని తాకట్టుపెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడని తెలిపారు. అదే విధంగా 1వ పట్టణ పోలీసు స్టేషనుకు చెందిన 3 కేసుల్లో 3  మోటారు సైకిళ్ళు, 2వ పట్టణ పోలీసు స్టేషనుకు చెందిన 3 కేసుల్లో 3 మోటారు సైకిళ్ళు దొంగాలించాడని తెలిపారు. వీటిని కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుడి మీద సస్పెక్ట్ షీట్ తెరుస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

కావున ప్రజలు మోటారు సైకిళ్ళను పార్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హేండిల్ లాక్ వేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. అదే విధంగా  నేరాల నియంత్రణ మరియు నేర పరిశోధనలో సిసిటివి కెమెరాల పాత్ర కీలకమని, కనుక దేవాలయాలు మరియు ఇతర మత సంబందమైన ప్రాంతాలు, అపార్ట్మెంట్స్, ముఖ్య కూడళ్ళ వద్ద సిసి కామెరాలను ఏర్పాటు చేయుటకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ కోరారు.

ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన 2వ పట్టణ పోలీసు స్టేషనుకు సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రమీల, పిసిలు వాసు, షఫీ, గణేష్ లను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి