అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు సాలూరులోని GHH School మరియు Jyothirao Phule School లలో బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బాలికలకు ప్రాథమిక స్వీయరక్షణ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తత, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం గురించి అవగాహన కల్పించబడింది. మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన రక్షణలు మరియు పోలీస్ సహాయంపై కూడా వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ భద్రతపై మరింత అవగాహనతో పాటు ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ ను అసెంబ్లీ ముట్టడిస్తాం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత