టిడిపి ప్రచారం

టిడిపి ప్రచారం

టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు,టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజుదేవ్ గారు సాలూరు మున్సిపాలిటీ పెద్ద మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
పెద్ద మార్కెట్లో ఉన్న కాయగూరలు, మాంసాహారం, వస్త్ర వ్యాపారస్తులు, నిత్యవసరాల వస్తువుల వ్యాపారస్తులు, కుండలు తయారీ, బార్బర్ షాపులు మొదలైన వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈ ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు.
సంధ్యారాణి గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం రావడం ఖాయం… సాలూరు నియోజకవర్గం నుండి మీ అందరి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, మీరు పడుతున్న ఇబ్బందులు అన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వ్యాపారస్తులు నష్టపోయారని, ఎవరు అధైర్య పడద్దని త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి