మెరకముడిదాం మండలం గర్భాం ఎర్రచెరువు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కనుసన్నల్లో ఆక్రమణకు గురయ్యిందన్న కధనంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం నేతలు ఖండించారు. గురువారం ఎ.ఎం. సి.అధ్యక్షులు తాడ్డి చంద్రశేఖర్ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన విలేఖరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ బి ఆర్ కె న్యూస్ ఛానెల్ లో ఎమ్మెల్యే కళావెంకటరావు కి తెలిసే గర్భాం ఎర్ర చెరువు ఆక్రమణలు జరిగాయి అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన బి. ఆర్. కె.ఛానల్ న్యూస్ పై పరువు నష్టం దావా వేయుటకు సిద్దపడుతునట్లు తెలిపారు. ఈ చెరువు విస్తీర్ణం ఎంత, దుకాణాలు ఎక్కడ ఉన్నాయో తెలిసికోకుండా వార్త ప్రచారం చేయడం సమాంజసం కాదని అయన తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్డుకు అనుకుని దుఖా నాలు నిర్మించుకుని సుమారు 25 ఏళ్ళు అవుతుందని, కళావెంకటరావు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ళు కాలేదని వార్త ప్రచారం చేసేముందు ఆలోచించాలని అయన తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ ఎర్ర చెరువుకి ఎటువంటి సంబంధం లేని, గౌరవప్రద శాసనసభ్యులికి సంబంధం ఉన్నట్లు నిరాధార వార్తలు రేటింగ్ పెంచుకోవడం కోసం ప్రసారం చేయడం తగదని అన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎం పి పి కోట్ల మోతిలాల్ నాయుడు మాట్లాడుతూ ఎర్రచెరువు సుమారు 26 ఎకరాలు విస్తీర్ణం ఉండగా అందులో రోడ్డు నిర్మాణంకు సుమారు 5 ఎకరాలు పోగా ఉన్న 20 ఎకరాల్లో 20 ఎకరాలు పైచిలుకు ఎలా ఆక్రమించుకుంటారని ప్రశ్నించారు. సంబంధిత ఛానల్ వారు ఇటు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, అధికారుల దగ్గర్నుంచి డాటా తీసుకోకుండా ఎవరో చెప్పిన గాలివార్తను మాధ్యమాల్లో ఎలా ప్రసారం చేస్తారని మండిపడ్డారు.ఆర్ అండ్ బి స్థలంలో షాప్స్ 25 ఏళ్ల క్రితం నిర్మించుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కనుసన్నల్లో ఆక్రమణ జరిగింది అనడం హాస్యాస్పదం అన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి పత్రికల, చానళ్ళు వారి విలువలు దిగజార్చ రాదని హితవు పలికారు . ఈ సందర్భంగా ఏం సి చైర్మన్ తాడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ మా చిన్నతనం నుండి రోడ్డుకు ఇరువైపుల దుఖానాలు ఉన్నాయని ఇప్పుడు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావుకు తెలిసి ఆక్రమణలు జరగడమేంటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తాడ్డి శ్రీధర్, పిన్నింటి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ సామాన్యులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు