విజయనగరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరమందు  యూనిసెఫ్ సహకారంతో సికిల్ సెల్ ఎనీమియా  (రక్తహీనతపై) వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు  అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  నేచర్ – యూనిసెఫ్ యువజన ఆరోగ్యం మరియు సికిల్ సెల్ రక్తహీనత కార్యక్రమంలో భాగంగా, నేచర్ సంస్థ 2026 ఏప్రిల్ 16న విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.ఈ కార్యక్రమంలో సికిల్ సెల్ రక్తహీనతకు సంబంధించిన నిర్ధారణ విధానాలు, స్క్రీనింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, తాజా వైద్య అభివృద్ధులు మరియు భవిష్యత్ కార్యాచరణపై విశదంగా చర్చించారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యాధికారులు మరియు కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిక్షణలో మొత్తం 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమానికి నిపుణులైన వనరుల వ్యక్తులు మార్గనిర్దేశం చేశారు. అందులో సలీమా భాటియా (యునిసెఫ్ ఎక్పర్ట్), కె. రాణి గారు (డి ఎల్ ఓ, విజయనగరం), డా. అనిల్ గారు (జనరల్ మెడిసిన్, కేజిహెచ్), డా.


విక్రాంత్ వర్మ గారు (పాథాలజీ) తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనత)ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య సేవలందించే వారి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. దీని ద్వారా జిల్లాలో ఆరోగ్య ఫలితాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమాన్ని నేచర్ బృందం సభ్యులు ఎస్. అనీష్, ఎం. ప్రసాద్, చైతన్య, రామకృష్ణ సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.                
   
                                                                                                                                                                 

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి