ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే.. తిరిగి ఎమ్యెల్యే ను కొట్టిన ఓటరు గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి గురై శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు అతడిని చితకబాదారు. ఈ ఘటనతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది.