ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ ఆర్థిక సహాయంగా కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఇంటికి ఆధారమైన అందికొచ్చిన కొడుకును కోల్పోవడం బాధాకరమని ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో ఆర్థిక చేయూత అందించారని కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారని అన్నారు. కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరని ఆవేద వ్యక్తం చేశారు ఈ గ్రామంతో, కుటుంబముతో తనకు మంచి అనుబంధ ఉందని అన్నివేళలా వారి కష్టసుఖాల్లో ఉంటానని హామీ ఇచ్చారు పార్థసారథి మంచి వ్యక్తిత్వం ఉన్న యువకుడిని మారుమూల గ్రామంలో పుట్టి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు అటువంటి వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారిని ఓదార్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, అధికారులు ,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు