తెట్టెడువలస, పాచిపెంట మండలం
ప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – చంద్రన్న ఆశయాలకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆచరణ
ఈ రోజు పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ పరిధిలో గల తెట్టెడువలస గిరిజన గ్రామంలో నెలవారీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మరియు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.
ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను అనుసరించి, ప్రజల వద్దకే ప్రభుత్వం వైఖరిని మంత్రివర్యులు ప్రదర్శించారు. తెట్టెడువలస గ్రామంలో మంత్రి స్వయంగా ఇంటింటికీ వెళ్లి బడుగు, బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందించారు.
“పెన్షన్ పంపిణీ కేవలం సంక్షేమం మాత్రమే కాదు, ఇది ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న బాధ్యతను వ్యక్తం చేస్తుంది. చంద్రన్న ఆశయాలను నిలబెట్టుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెను గెలుచుకునేలా ప్రభుత్వం పనిచేస్తోంది” అని తెలిపారు.






