సాలూరు ప్రజల కల నెరవేరింది

సాలూరు ప్రజల కల నెరవేరింది

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది.  సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా  ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో   సాలూరు బొబ్బిలి పట్టణాల మధ్య విద్యుదీకరణ పనులు, రెండవ లైను ఏర్పాటు చేశారు.   ఇటీవల రైలు రాకపోకలకు సంబంధించి టైమింగ్స్ కూడా ప్రకటించింది. లోకో పైలట్, సిబ్బంది నియామకంపై డిఆర్ఎం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ట్రైల్ రన్  నిర్వహిస్తున్నట్లు రెండు రోజుల కిందట రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నంలో బయలుదేరిన రైలు సాలూరు చేరింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ఆర్పీ బాంజ్ దేవ్ తో మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇంత పెద్ద రైల్వే స్థలం అనేది కేవలం సాలూరులో మాత్రమే ఉందని సాలూరు రైల్వే స్టేషన్ పరిధిలో వర్క్ షాప్ వచ్చే అవకాశం ఉందని దీనికోసం కేంద్ర మంత్రుల లోకి తీసుకెళ్లి రైల్వే వర్క్ షాప్ వచ్చేలా కృషి చేస్తామని ఈయన తెలిపారు   రైలు చూసేందుకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రజలు వచ్చారు. ఆసక్తి గా తిలకించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి