*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన స్వాగతోత్సవ వేడుకలు* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి గారు వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ గురజాడ విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ అమూల్యమైందని అని తెలుపుతూ విద్యార్థులు సృజనాత్మకతతో ఉద్యోగ, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నారు.అలాగే సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా డాక్టర్ ఎల్.విజయలక్ష్మి గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్,చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానము సామాన్యులను ముంగిట చేరటానికి ఇంజనీర్లుగా కృషి చేయాలని కోరారు.మరియు అభివృద్ధికి సాంకేతిక విద్య ఫ్లాట్ ఫామ్ లాంటిదని తెలిపారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉత్తమ ఇంజనీర్లుగా వెలుగొంది భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని,దేశ పురోగతి మన యువత పైన ఆధారపడి ఉందని తెలియజేశారు.మరియు ఈ కార్యక్రమానికి మరొక గౌరవ అతిథిగా టి.సురేష్ కుమార్ గారు లీడ్ కన్సలంట్ విప్రో,విశాఖపట్నం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల యొక్క అకాడమిక్ రికార్డు బాగుండాలని,కంప్యూటర్ లాంగ్వేజ్లను పెంపొందించుకొనుట ద్వారా ప్రాంగణ ఎంపికల్లో సులువుగా సెలెక్ట్ అవ్వచ్చని తెలిపారు.మరియు మరొక అతిథిగా బ్రహ్మకుమారి హేమలత గారు పాల్గొని మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి సెల్ఫ్ మోటివేషన్,పాజిటివ్ యాటిట్యూడ్ తో మెలగాలని కోరారు.ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలు నుండి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని తెలిపారు.మరియు విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్,టెక్నికల్ స్కిల్స్ పెంపొందించే విధంగా కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులతో కలిసి అవంతి క్రోనికల్ న్యూస్ లెటర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల ప్రతినిధి ఎమ్.మహేష్,అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఏ. చంద్రశేఖర్ గారు,వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.