ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కోడెనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్లకు తీవ్ర గాయలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం దిమరాపాల్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో దాదాపు 40 మంది సైనికులు ఉన్నట్టు సమాచారం.
జగ్దల్‌పూర్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధుల నుంచి సైనికులు తిరిగి వస్తున్న సమయంలో రాయకోట్ జాతీయ రహదారి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పశువుల మంద ఎదురుగా రావడంతో అదుపు బస్సు అదుపు తప్పిందని బస్సులో ప్రయాణిస్తున్న జవాన్లు తెలిపారు. ప్రమాదంలో బస్సు కింద ఓ ఆవు ఇరుక్కపోయింది. దీంతో జవాన్లంతా కలిసి బస్సుని పైకి లేపి ఆవును రక్షించారు