ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి





ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా కూడా గిరిజనుల మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదు. పైగా గిరిజనుల హక్కులను హరిస్తూ, వారిని అణచివేసే దిశగా అడుగులు వేస్తుండం చాలా అన్యాయం. PESA ఎన్నికలు, ITDA సార్వతీపురం పరిదిలో ఉన్న 216 గిరిజన గ్రామ పంచాయితీ లో జరగాల్సి ఉన్నప్పటికీ కేవలం 77 గిరిజన గ్రామ పంచాయితీల్లో మాత్రమే నిర్వహించడం దీనికి నిదర్శనం. ఇది గిరిజనులను అణచి వేయడానికి వేస్తున్న ఎత్తుగడగా పరిగణిస్తున్నాము.

జగ్గుదొర వలస గ్రామంలో షెడ్యూల్డ్ విషయంపై నిగ్గుతేల్చాలని, ITDA పార్వతీపురం పరిధిలో ఉన్న 1496 గ్రామాల్లో గిరిజన చట్టాలను అమలు చేసి వాటిని షెడ్యూల్డ్ గ్రామాలుగా పరిగణించాలని కోరుతూ దాదాపు 1000 రోజుల పాటు ధర్నా చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. గిరిజనులకు న్యాయం చేయలేదు.

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం GO. నెం. 3 ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మా గిరిజనులు జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం. కానీ ఈ వంద రోజుల పాలనలో అలాంటిది ఏమీ కనపడలేదు. నాటి ప్రభుత్వానినకి GO నెం. 3 పునరుద్ధరించే అవకాశం లేదు ఎందుకంటే అది కోర్టులో ఉన్నది. కానీ నేటి ప్రభుత్వానికి G.O. నెం.3 ని మళ్ళీ అమలు చేసే అవకాశం ఉన్నది, లేదా దాని స్థానంలో కొత్త జీవోని, కూడా  అమలు చేయొచ్చు కాబట్టి ఈ విషయాన్ని గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయిన  గుమ్మడి సంధ్యారాణి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి కొత్త జీవోని తీసుకురావాలని చేతులు జోడించి మరీ అడుగుతున్నాము. అలాగే షెడ్యూల్డ్ ఏరియా విషయం కూడా తొందరలోనే తేల్చాలని కోరుతున్నాం. మా విన్నపాన్ని మన్నించి తీర్చిన యెడల మేము సంతోషిస్తాము. లేకపోతే మా గిరిజనులమంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్థాం, రాష్ట్ర ఆదివాసీ JAC, మిగతా గిరిజన సంఘాల సహకారంతో న్యాయ పోరాటం చేస్తాం, ధర్నాలు, రాస్తా రోకోలు చేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వానికి సవినయంగా మనవి చేసుకుంటున్నాం.

*క్లుప్తంగా :*

*1) G.0. నెం 3 ను పునరుద్ధరించాలి లేదా దాని స్థానంలో కొత్త జీవో అమలు చేయాలి.*

*2) PESA ఎన్నికలు పార్వతీపురం ITDA పరిదిలో ఉన్న 216 గ్రామ పంచాయితీలలో నిర్వహించాలి.*

*3) షెడ్యూల్ట్ ఏరియాని 1496 గ్రామాలలో కూడా అమలు చేయాలి, అన్ని గిరిజన చట్టాలను గ్రామాల్లో అమలు చేయాలి.*

*4) పైన తెలిపిన అన్ని డిమాండ్లు నెరవేరని యెడల ఉద్యమం తప్పదు.*

ఇట్లు
జగ్గు దొరవలస గ్రామస్తులు

నిమ్మక అన్నారవు, సీదరపు చిన్నప్ప, బాడంగి బాబయ్య, సీదరపు ప్రకాష్, సీడరపు రామయ్య, కోలక నారాయణ, యువత మరియు గ్రామస్తులు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *