కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి …
విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం లో కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి … ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో షెడ్ లో ఉన్న గొర్రె పిల్లలు పై కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేయడంతో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయని యజమాని దేవర సతిబాబు వాపోయారు . గ్రామంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయని , గొర్రె పిల్లలకు ఎంత రక్షణ కల్పించినా తాము ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరిగిందని , సుమారు రెండు లక్షల రుపాయులు వరకు నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు ….