అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదల
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కోసం 05.01.25 అనగా ఆదివారం నాడు ప్రతభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలిపారు.ఈ సందర్బంగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు చేతులు మీదుగా పోస్టర్ విడుదల చేశారు.మరియు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీయటానికి ఇటువంటి ప్రతిభ పరీక్షలు ఎంతగానో దోహదం చేస్తాయని మరియు కాంపిటీషన్ స్పిరిట్ ను ప్రోత్సహించటానికి ఉపయోగపడుతుందని తెలిపారు.ఇటువంటి ప్రతిభ పరీక్షలు ఇకనుండి ప్రతీ సంవత్సరం వుంటాయిని ఈ సందర్భంగా తెలియజేశారు.మరియు ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఈ పరీక్ష పదవ తరగతి మాథ్స్,ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులపై ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయిని తెలిపారు.ఈ ప్రతిభ పరీక్షలో మార్కులు ఆధారంగా ప్రధమ,ద్వీతీయ మరియు తృతీయ బహుమతులు ఉంటాయిని తెలియజేసారు.కావున అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ఈ ప్రతిభ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతిభ పరీక్ష వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :8121987431,83176 86432,83091 99291.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.