పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం Ys వలస గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం.
ఎస్ఎఫ్ఐ బృందం YS వలస గిరిజన హాస్టల్ పాఠశాల సందర్శించే సందర్భంలో
ఎస్,ఎఫ్,ఐ జిల్లా కోశాధికారి టి. అఖిల్ మాట్లాడుతూ….
ఆదివారం YS వలస గిరిజన ఆశ్రమ పాఠశాలో ఉడికి ఉడకని బిర్యాని పెట్టిన పరిస్థితి నెల్కొంది, విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారని అన్నారు.ఇంతకు ముందు రెండు వారాలు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నధి అని అక్కడున్న విద్యార్థులు,విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది, భోజనాలు సదుపాయాలు కూడా బాగు లేవని భోజనం బాగోలేదని అడిగిన విద్యార్థిని TC ఇచ్చి ఇళ్లకి పంపిస్తామని బెదిరిస్తున్నారన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తెలియజేశారు . కనుక HM వార్డెన్ లను సస్పెండ్ చేయాలని కోరారు.
ఉన్నతాధికారులు స్కూల్ కి వెళ్లి దర్యాప్తు చేసి తక్షణమే HM,వార్డన్ లను సస్పెండ్ చేయాలని SFI నాయకులు డిమాండ్ చేశారు.
లేని యడల భవిష్యత్తులోలు విద్యార్థులు, విద్యార్థిని తల్లిదండ్రులతో ఆందోళన చేపడతామని ఎస్,ఎఫ్,ఐ నాయకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్,ఎఫ్,ఐ జిల్లా కమిటీ సభ్యులు హెచ్. సింహాచలం కె. డేవిడ్ జి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.