ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం




చీపురుపల్లి పట్టణం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం

చీపురుపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులుకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పట్టణ వైస్సార్ పార్టీ నాయకుడు పతివాడ రాజారావు, సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, చీపురుపల్లి సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీను విద్యార్థులు కు బుక్స్ పంపిణీ చేసారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ చీపురుపల్లి మండలం కానీ నియోజకవర్గం కానీ గ్రామీణ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు పేద బడుగు బలహీనవర్గాలు వారు ఎక్కువగా ఉండే ప్రాంతం అని 2004 ముందు విద్యార్థులు 10వ తరగతి తరువాత చదువుకోవాలంటే ప్రెవేట్ కాలేజీలకి వేల రూపాయలు డబ్బులు కట్టి చదువుకున్న పరిస్థితి ఉండేది అని, డిగ్రీ, పాలిటెక్నిక్ చదవాలంటే విజయనగరం, విశాఖపట్నం వెళ్ళలిసిన పరిస్థితి లో చాలా మంది స్థోమత లేక మధ్యలో చదువు ఆపేసే వారు అని, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మంత్రి అయిన తరువాత చీపురుపల్లి నియోజకవర్గం లో చీపురుపల్లి లో ప్రభుత్వడిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ, వెటర్నరీ పాలిటెక్నికల్ కాలేజీ అలాగే మెరక ముడిదాం, గుర్ల లో ప్రభుత్వజూనియర్ కాలేజీ లు తీసుకుని వచ్చారు అని తెలిపారు, చీపురుపల్లి ప్రభుత్వజూనియర్ కాలేజీకి కూడా నాడు నేడు ద్వారా మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 85 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి క్లాసురూమ్ లో కూడా ఫ్లోరింగ్, టేబుల్స్, ఫ్యాన్స్, లైట్స్, డిజిటల్ స్క్రీన్ లు, టాయిలెట్స్ అన్ని కూడా పనులు పూర్తి చేసుకున్నాం అని తెలిపారు, స్థానిక ప్రజా ప్రతినిధులు గా కాలేజీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు, కాలేజీ త్రాగునీటికి సమస్య ఉంటే ఎంపీపీ నిధులు నుంచి బోర్ మోటార్ తప్పకుండా కాలేజీ కి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు, కాలేజీ గ్రౌండ్ కి 10 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాము అని, అలాగే జడ్పీటీసీ నిధులతో రెండు సోలార్ లైట్స్ కాలేజీ ఆవరణలో వేసుకున్నాం అని తెలిపారు, విద్యార్థులు అందరూ తల్లి తండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా చక్కగా చదువుకోవాలని తెలిపారు గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ఇయర్ 42%, సెకండ్ ఇయర్ 65% రిజల్ట్ వచ్చింది అని వచ్చే సంవత్సరం మరింత మెరుగు అయిన రిజల్ట్ తేవాలని ప్రిన్సిపాల్ గారిని సిబ్బందిని కోరారు, ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం,జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పట్టణ అధ్యక్షులు పతివాడ రాజారావు, జి.ములగాం సర్పంచ్ కరిమజ్జి శ్రీను, సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీనివాసరావు, కనకమహాలక్ష్మి కోవెల చైర్మన్ ఇప్పిలి గోవింద, ఎంపీటీసీ లు గిరిడి రామదాసు. కోరుకొండ దాలయ్య, ముళ్ళు పైడిరాజు, మాజీ సోసైటీ ప్రెసిడెంట్ రేవల్ల సత్తి బాబు, వార్డ్ మెంబెర్స్ కర్ణపు అది, గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ ప్రభాత్ కుమార్, నాగచైతన్య, వెంకీ, వినోద్,  కళాశాల ప్రిన్సిపాల్ మద్దెల వినోద్ బాబు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి