చీపురుపల్లి:  గుర్ల మండల హెడ్ క్వాట్టర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి:  గుర్ల మండల హెడ్ క్వాట్టర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు


చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మాట్లాడుతూ..
రంగులు, పబ్లిసిటీ పిచ్చి కాదు విద్యాభివృద్ధి అంటే..విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచి, సృజనాత్మకత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల సామర్థ్యం పెంచి మంచి ఫలితాలకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే మా లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఆకాక్షించారు..కూటమి ప్రభుత్వం వచ్చాక పేద
విద్యార్థులకు మరింత ఊరట కలిగిందని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, అచ్చు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గతంలో హామీ ఇచ్చారని.ఆ మాట ప్రకారం తొలి విడతగా నోట్ బుక్స్, బ్యాగులను కళాశాలలకు పంపిణీ చేశారని కళావెంకటరావు గారు అన్నారు. వైకాపా పాలనలో ఇంటర్ విద్యార్థులు పుస్తకాలకు నోచుకోలేదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విద్యార్థులు అందరూ పేదవారే. ప్రభుత్వ మారడంతో తమకు పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టడం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
ప్రస్తుతం నోట్ పుస్తకాలు, బ్యాగులు వచ్చాయని, వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి