చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రధానమైన చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం చాలా పురాతనమైన బిల్డింగులు కొన్ని రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్షాకాలం వచ్చిందంటే రూములకు చెమ్మలు నీరు చుక్కలు కారటం స్లాబ్ సీలింగ్ పెచ్చును ఊడిపోయి పడిపోవడం జరుగుతుంది ఎంతో విలువైన భూముల రికార్డులు మరియు కంప్యూటర్లు ఉన్నాయి ఉద్యోగస్తులు తమ ప్రాణాల్లో పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నారు నిత్యము ప్రజలు నాయకులు సమస్యలు విన్నవించుకోవడానికి దరఖాస్తులు ఇవ్వడానికి వస్తూ ఉంటారు వచ్చిన ప్రతిసారి భయాందోళన చెందుతారు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం అధికారులు మేలుకొని ఈ కార్యాలయంపై దృష్టి పెట్టి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తారని ప్రజలు నాయకులు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు