చీపురుపల్లి,
తేదీ 14/11/2024.
విజయనగరం జిల్లా చీపురుపల్లినియోజకవర్గంలోని ఆర్డీవో ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహం లో ఈరోజున భారతదేశ మొదటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి బాలల దినోత్సవ వేడుకలను పిల్లల సమక్షంలో జరుపుకోవడం జరిగింది .
ఈ సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లలకు పాఠ్య పుస్తకాలు స్వీట్లు పంచి నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు.
అనంతరం విసినిగిరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే ఎంతో ఇష్టమని అందుచేతనే ఆయన పుట్టినరోజు నాడు బాలల దినోత్సవం గా జరుపుకోవాలని ఆయన సూచించారని తెలిపారు. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అని నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన మహానీయుడని కొనియాడారు. పిల్లలందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందక బాల కింతలివాసు,సత్యజి, జనసేన శంకర్ తదితరులు పాల్గొన్నారు