చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు



గుర్ల మండలంలోని తాతావారి కిట్టలి గ్రామ పరిధిలో గడిగెడ్డ రిజర్వాయర్ నందు రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ…
ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే చంద్రన్న ధ్యేయం అని అన్నారు.
రైతులంతా నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగించుకుని రబీ పంటలను సాగు చేసుకోవాలని అన్నారు.
రైతాంగం ఆశలను చిగురింప చేసి,వరి సాగుకు నీరిచ్చి,రైతాంగానికి అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు గారికి రైతన్నల తరుపున కృతజ్ఞతలు తెలిపారు
రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అన్నారు.
ఈ కార్యక్రమంలో  రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వెన్నె సన్యాసినాయుడు. టి కిరణ్. Ch మహేశ్వరావు. ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులాపల్లి నారాయణరావు టీడీపీ  కూటమి నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, అధికారులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి