విజయనగరం జిల్లా గరివిడి ఎస్ డి ఎస్ అటానమస్ కళాశాలలో సినిమా సందడి
శ్రీ పద్మిని మూవీస్ బ్యానర్ తో తెలుగు మరియు మరాఠీ భాషల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. కళాశాల లో చిత్రీకరణ కావడంతో గరివిడి దుర్గాప్రసాద్ సారాఫ్ అటానమస్ కళాశాలలో , కళాశాలకు సంబంధించిన సన్నివేశాన్ని సినిమా బృందం తెరకెక్కిస్తుంది. సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలుసుకున్న స్థానికులు చిత్రీకరణ చూడటానికి ఎగబడ్డారు. కళాశాలలో రెండు రోజులు పాటు సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆ ఫోటోగ్రఫీ గా షేక్ హజరత్ (వల్లి),శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు., కళాశాలలో చిత్రీకరణకు అనుమతి ఇచ్చిన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బి.రవి గారు కి చిత్ర బృందం ధన్యవాదాలు తెలియజేసింది.