పేదలకు అండగా CM సహాయనిధి

పేదలకు అండగా CM సహాయనిధి

*పేదలకు అండగా CM సహాయనిధి*

లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు  చెక్కులను అందజేశారు

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో

వారణాసి గోవిందరావు గారికి ₹75,000 (తోణం, సాలూరు)

  బోనం శారద గారికి ₹1,04,136 (22వ వార్డ్,సాలూరు)

  కందివలస శ్రీను గారికి ₹70,000 ( లక్ష్మీపురం, మెంటాడ )

మంజూరు చేయబడింది. మొత్తం ₹2,49,136 విలువైన చెక్కులు లబ్దిదారుల చేతికి మంత్రి అందచేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆనారోగ్య సమస్యల సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు.

CMRF ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తుందని మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి గారు అన్నారు. సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి వ్యక్తికి మద్దతు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి