ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ, లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు తన ఉదారతను చాటుకున్నారు.చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలంలో పర్యటించిన ఆయన, ఇటీవల వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రస్తుతం ఇళ్ల వద్ద విశ్రాంతి తీసుకుంటున్న 29 మంది లబ్ధిదారులను స్వయంగా కలిశారు. ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 19,13,587/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకుంటూ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, నేరుగా నాయకుడే ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేక చొరవతో ఇంటికే వచ్చి చెక్కులు అందించిన శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు