విజయనగరం/చీపురుపల్లి, ఫిబ్రవరి 26: చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఈ నెల 28న ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తో కలిసి కార్యక్రమ స్థల ఏర్పాట్లు, భద్రత, వేదిక నిర్వహణ, ప్రజలకు సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించారు. అదేవిధంగా, లబ్దిదారుతో ముఖ్య మంత్రి ఇంటరాక్షన్, క్యాడర్ మీటింగ్, సిహెచ్సిలో ఏర్పాటు చేయనున్న hpv వాక్సిన్ వేదిక, హెలిపాడ్, తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు జారీ చేసారు.పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్‌లు అధికారులకు పలు సూచనలు జారీ చేస్తూ, ముఖ్యమంత్రి పర్యటన సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, రవాణా నియంత్రణ, వైద్య సదుపాయాలు, తాగునీరు, శానిటేషన్ వంటి ఏర్పాట్లు సమర్థంగా చేయాలని సూచించారు.అదేవిధంగా, అదే రోజు 14–15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ (కొన్ని క్యాన్సర్ల నివారణకు) పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చీపురుపల్లి నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా పాల్గొననున్నారని తెలిపారు. ఇందుకు అవసరమైన సాంకేతిక, వైద్య, లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ రెండు కీలక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ మోటారు సైకిళ్ళ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు