*చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..చరిత్రలో తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది..గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిది.. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అంగన్వాడీలకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల జాప్యానికి శాశ్వత చెక్ పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించింది.. ఈ స్మార్ట్ ఫోన్లు ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్ధవంతంగా సేవలు అందుతున్నాయి.. అంగన్వాడీ కేంద్రాల హాజరు 70 నుంచి 96 శాతానికి పెరగడం కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితం. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యూటీ కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది.. గ్రాట్యుటీ చెల్లింపులు కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రూ20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అందన్వాడీలకు అండగా నిలిచింది.రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలకు పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తోంది.. ఇందులో భాగంగా, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్ గా పదోన్నతి కల్పించింది.. అలాగే, కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించింది.. అంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించింది.. వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసేదిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యం ఇస్తోంది..ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తూ, ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వం ఆర్థికరంగాన్ని దివాళా తీసి వెళ్లింది, వారు చేసిన అప్పులకు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడింది. Spread the love టపా నావిగేషన్ తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర