చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుణుపూరు మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అతడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న గుణుపూరు మహాలక్ష్ము గారికి, వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000/- స్థానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెంచిన రూ. 10,000/- ల డయాలసిస్ పెన్షన్ను రామ మల్లిక్ నాయుడు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గతంలో మీకు వృద్ధాప్య పెన్షన్ 4 వేలు వచ్చేది. కానీ ఇప్పుడు మీకు కిడ్నీ సమస్య వచ్చి డయాలసిస్ కి వెళ్తున్నారు కాబట్టి, మీ వైద్య ఖర్చుల కోసం చంద్రబాబు నాయుడు ఈ నెల నుంచి మీకు పదివేల రూపాయల పెన్షన్ (₹10,000/-) ఇస్తున్నారు. కష్టకాలంలో ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి” అని భరోసా కల్పించారు. Spread the love టపా నావిగేషన్ అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగి