చీపురుపల్లి  మండలం పుర్రేయవలస గ్రామ నివాసి అయిన కంది వాసుదేవ రావు ప్రస్తుత రాజమండ్రి జిల్లా విద్యా శాఖా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల అతని తండ్రిగారైన విశ్రాంతి ఉద్యోగస్తులు కంది సత్యనారాయణ గారు  అనారోగ్య కారణాలుతో మృతి చెందారు వార్త తెల్సుకొని వైయస్ఆర్సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, గవిడి సురేష్, ప్రభాత్ కుమార్, స్థానిక వైసిపి నాయకులు   ఇంటికి  వెళ్లి, వారి తండ్రి గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయటం జరిగింది. 
అలాగే చీపురుపల్లి పట్టణంలో  జి అగ్రహారం లో ఇటీవల కరెంట్ షాక్ తగిలి చిన్నారి బాలిక మృతి చెందిన కుటుంబాన్ని  పరామర్శించి తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైఎస్ఆర్ సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మంగళగిరి శ్రీనివాసరావు, రౌతు పైడ్రాజు,  కోరుకొండ దాలయ్య, కుర్రోతు ప్రసాద్, గవిడి సురేష్, ప్రభాత్ కుమార్, అఖిల్, డబ్బాడ ఆనంద్,
మరియు స్థానిక గ్రామ ప్రజలు పాల్గున్నారు.







 
             
                                         
                                        