ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ

-ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో,

సాలూరు, అక్టోబర్ 19, మేజర్ న్యూస్:

సాలూరు పట్టణంలో 2021 వ సంవత్సరం నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమంను నిర్విరామంగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సాలూరు పట్టణానికి చెందిన ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో తేలగం శెట్టి అనిల్ కుమార్ మరియు మిత్ర బృందం అన్నదానం కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ హాజరయ్యారు.2021వ సంవత్సరం నుండి నుండి ఈరోజు వరకు వెయ్యి అరవై ఎనిమిది రోజులు ఆయన సందర్భంగా స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ చేతుల మీదుగా అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. సాలూరు ఏరియా ఆసుపత్రికి ఎక్కువగా గిరిజనులు వస్తూ ఉంటారని వారికి అన్నదానం సేవ చేయడం చాలా సంతోషకరమని అన్నారు. తెలగం శెట్టి అనిల్ కుమార్ మరియు మిత్రబృందం ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నందుకు స్థానిక బంగారమ్మ కాలనీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలగం శెట్టి అనిల్ కుమార్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి