రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు. ఈరోజుకు 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ *అప్పలనాయుడు* గారు గొర్ల సూర్య గారిని దుస్సాలువుతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి మహోత్రమైన కార్యక్రమం చేపట్టిన సూర్య గారికి ప్రత్యేక అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని మరియు పేదలు, కూలీలు, ఇతరుల ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సూర్య గారు మాట్లాడుతూ టీడీపీ అధినేత *మన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారిని, జనసేన అధినేత *శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్* గారిని ఆదర్శంగా తీసుకొని ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.