డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు

తేదీ: 04.01.2025
చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం

సోమలింగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు,సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి నాణ్యమైన ఆహారం ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మరోమారు నిరూపించిందన్నారు.

మనం తీసుకునే చిన్నచిన్న మార్పులే పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయని. ఈ పథకం ద్వారా విద్యార్థులు మరింత ఆరోగ్యంగా ఉండి తమ చదువుపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం వివిధ రంగాలలో విజేతలగా నిలిచిన విద్యార్థులను అభినందించి,కళాశాలలో గల ల్యాబ్ లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతి నిధులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి