విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్* నెల్లిమర్ల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువతకు మహిళల భద్రత, రహదారి భద్రత, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు “త్రిశూల్” కార్యక్రమాన్ని అక్టోబర్ 7న సెంచూరియన్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* మాట్లాడుతూ – రహదారి భద్రత, మహిళలు, బాలల భద్రత, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించేందుకు “త్రిశూల్” పేరుతో యువతలో చైతన్యం నింపేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. యువకులు, స్టూడెంట్స్ అవగాహన లోపంతో గంజాయి కేసుల్లో దురదృష్టవశాత్తు నిందితులుగా మారుతున్నారన్నారు. చెడు స్నేహితుల ఒత్తిడితో యువత గంజాయికి అలవాటు పడుతున్నారన్నారు. చదువుకొనే వయస్సులో చెడు అలవాట్లకు సరిపడే డబ్బులులేక చోరీలకు పాల్పడడం, గంజాయి అక్రమ రవాణతో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా అరెస్టుకాబడి, జైళ్లలో మగ్గుతున్నారన్నారు. గంజాయి వినియోగంతో యువత ఆరోగ్యం కోల్పోవడంతోపాటు, సైకోగా మారి, మహిళలు, బాలికలపై భౌతిక దాడులకు పాల్పడుతూ, కుటుంబాలకు భారంగా మారుతున్నారన్నారు. నేర చరిత కలిగిన యువకులు పోలీసు వెరిఫికేషన్ తో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతారన్నారు. గంజాయి నియంత్రణ పట్ల పోలీసుశాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, వారిపై పి.డి.చట్టం ప్రయోగించి, ఒక సం. పాటు బెయిల్ పొందని విధంగా చేసి, జైలులోనే జీవితం గడిపే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి వినియోగం ప్రాధమిక స్థాయిలో ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ లో చికిత్స పొందవచ్చునన్నారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100/112 సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. బాలికలను, మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులపై న్యాయ స్థానాల్లో నేరారోపణలు రుజువు కావడంతో 35 పోక్సో కేసుల్లో 20 సం.లకు పైబడి శిక్షలు విధించడం జరిగిందన్నారు. కావున, యువత ఆకతాయి పనులకు స్వస్తి పలికి, మహిళలు, బాలికల పట్ల గౌరవ భావంతో మెలగాలనన్నారు. మన నిర్లక్ష్యం కారణంగా రహదారి ప్రమాదాల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. రహదారి ప్రమాదాల్లో కుటుంబ పెద్ద ఆకస్మికంగా మరణిస్తే, కుటుంబాన్ని పెంచే యజమాని లేక, వారి పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడమే కాకుండా, ఉపాధి కోల్పోయి, పిల్లలు చదువులకు దూరమై, రోజులు గడవని ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. కావున, ఎవరైనా కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లే సమయంలో హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, రహదారి భద్రత నియమాలు, నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. వీటితోపాటు యువత భవిష్యత్తును నాశనం చేసే బెట్టింగ్స్ కు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలన్నారు. యువత మంచి క్రమశిక్షణ, మంచి నడవడితో చదువులపై దృష్టి పెట్టాలని, లక్ష్యాల సాధించేందుకు కృషి చేయాలని, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు దూరంగా ఉండాలని, సాంకేతికతను మంచి విషయాలు తెలుసుకొనేందుకు ఉపయోగించుకోవాలని, తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలను వినాలని, ప్రలోభాలు పెట్టే ఆకర్షణలకు దూరంగా ఉండాలని, ఉన్నత చదువులతోనే ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలని యువతకు జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్ ఐపీఎస్ గారు* దిశా నిర్దేశం చేశారు. అనంతరం, గంజాయి దూరంగా ఉంటామని విద్యార్థులతో డీఎస్పీ ఎస్.రాఘవులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఎస్.రాఘవులు, సెంచూరియన్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి.రవి కుమార్, భోగాపురం రూరల్ సిఐ ఎన్.శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎస్సై గోపాలరావు, బొండపల్లి ఎస్సై మహేష్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ దుర్గా దేవి నవరాత్రి మహోత్సవములుకు లక్ష రూపాయలుసహాయం అందించిన సిరి సహస్ర