చీపురుపల్లి నియోజకవర్గం
చీపురుపల్లిలో పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటీన్’ ప్రారంభం : సామాన్యులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు.

చీపురుపల్లి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు  కిమిడి కళా వెంకట్రావు మరియు  కిమిడి రామ్ మాలిక్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు  మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించడం ద్వారా పేదల ఆకలి తీర్చే సువర్ణ అధ్యాయం మొదలైంది. కేవలం ఐదు రూపాయలకే శుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. నిరుపేదలు, కూలీలు మరియు బాటసారులకు ఈ క్యాంటీన్ ఒక వరప్రదాయిని” అని పేర్కొన్నారు.

కిమిడి రామ్ మాలిక్ నాయుడు  మాట్లాడుతూ, చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి