పార్టీలకు అతీతంగా ఆరోగ్యశ్రీని అమలు చేసింది స్వర్గీయ డాక్టర్ys రాజశేఖర్ రెడ్డి

పార్వతీపురం మన్యం  జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం  లో స్వర్గీయ డాక్టర్ ys రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర మాట్లాడుతూ డా.రాజశేఖరరెడ్డి  ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిన తరువాత మొట్టమొదటి ఆపరేషన్ మామిడిపల్లి వాళ్లకే జరిగింది.అది కూడా ప్రతిపక్షములో ఉన్న టీడీపీ వారికే జరిగింది.ఆమె పేరు డొంక.జయప్రద కావాలి అంటే  మీరు రికార్డులు చూసుకొండి అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.                                                కులాలు,మతాలు,పార్టీలు చూడకుండా టిడిపి అయినప్పటికి కూడా ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఆపరేషన్ చేయించారు .                                                                                       కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు వైసీపీ వారికీ ఏమీ చేయకండి అంటున్నారని రాజ్యాంగ బద్ధంగా, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేసిన ముఖ్య మంత్రి చంద్రబాబు గారు అలా చెప్పడం సరికాదు అని రాజన్న దొర అన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి