*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*:
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్.రాఘవులు గారు DSP సబ్ డివిజన్ చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ తో యువత,విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని,డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులు మత్తు పదార్థాల వేటలో పడి అసాంఘిక కార్యక్రమాలకు లోనై జైలు జీవితానికి గురి కావద్దని కోరారు.ఒక విద్యార్థి డ్రగ్స్ కు అలవాటు పడితే ఆ విద్యార్థితో పాటు వారి ఫ్యామిలీని కూడా సమాజం నుండి వెలివేస్తారని తెలియజేశారు.అలాగే NDPS చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు వేస్తారని తెలిపారు.విద్యార్థులు మత్తు పదార్థాల వేటలో పడి అసాంఘిక కార్యక్రమాలకు లోనై జైలు జీవితానికి గురి కావద్దని కోరారు.ఈ విధంగా డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరిస్తూ డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా జి.శంకర రావు గారు సి.ఐ చీపురుపల్లి నుండి విచ్చేసి నేటి యువత దేశానికి శక్తి అటువంటి యువత గంజాయి,కొకైన్,హఫీష్,హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.అలాగే ఈ మాదకద్రవ్యాలు యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలిగొంటున్నదని తెలిపారు. మరియు బి.లోకేశ్వరరావు గారు ఎస్.ఐ గరివిడి నుండి విచ్చేసి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తమ బంగారు భవిష్యత్ శూన్యం అవుతుందని సూచించారు.మాదకద్రవ్యాలు వాడకం వలన భవిష్యత్తులో జరుగు అనర్థాలను,ఎదుర్కొనే సమస్యలను లఘు చిత్రాలు,వీడియోస్ ద్వారా విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. చివరగా విద్యార్థులతో డ్రగ్స్ జోలికి పోభోమని ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కాలేజీలో సంకల్పం ఫిర్యాదులు పెట్టే అమర్చారు. మరియు విద్యార్థులకు డ్రగ్స్ వలన వచ్చే అనర్ధాలపై అవగాహన కోసం కరపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్.ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ,ఏ.ఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.