విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, రామలింగాపురం, పుర్రేయవలస గ్రామాల మధ్యన వెలిసియున్న దక్షిణ హరిద్వార్ గా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్ తర్వాల్ దర్శించుకొని
ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ధర్మకర్తలు పిన్నింటి రమణ, ఈశ్వరమ్మ దంపతులు, కుమారుడు శ్రీను, ప్రధాన అర్చకులు గౌరవంగా దుస్సాలువా కప్పి అమ్మవారు ఫోటో మరియు ప్రసాదం అందజేసి ఆశీర్వాదములు అందజేశారు,ఈ సందర్భంగా సుమన్ మాట్లాతూ ఆలయంను అమ్మవారిని గతంలో దర్శనంచేసికొని కోరికకోరుకొన్నాను. అది నెరవేరడంతో మళ్ళీ అమ్మవారిని దర్శనంకోసం వచ్చాను అన్నరు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం అదృష్టంగా భావించారు ఈ మహిమగల అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనాలు ఇస్తారన్నారు బాల త్రిపుర సుందరిగా, గాయత్రీ దేవిగా, పూర్ణదేవిగా, మహాలక్ష్మి దేవిగా, కాత్యాయనీగా, సరస్వతి దేవిగా, లలితాదేవిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్దిని గా, రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అన్నారు. సినీనటుడు సుమన్ కలిసిన మాజీ సొసైటీ అధ్యక్షులు బెల్లాన త్రినాధ్, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఇప్పిలి సూర్యప్రకాష్ (గోవిందా) సర్పంచ్ సారిక మోహన్, పి.కుమార్, ప్రభాత్ కుమార్ తదితరులు ఈ సందర్బంగా భక్తులు సుమన్ అభిమానులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరింంచారు





