చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం



వినాయక శరన్నవరాత్రి  ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి మండలం పుర్రేయవలన గ్రామం, పట్టణం అడ్డూరి వీధిలో  కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద  ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం, పుష్పం, ఫలం సమర్పిస్తారు. అలాంటి గజముఖు మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా… ఇలా వివిధ రూపాలలో భక్తులకు దర్శనాలు ఇస్తారన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అన్నారు. అన్నదానంలో పాల్గొన్న మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలి రెడ్డి శ్రీనివాస నాయుడు, ఎంపీపీ కుమార్తె వింధ్య వాసిని, శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి డైరెక్టర్ కంది శ్రీరాములు, అప్పలనాయుడు, కంది దుర్గారావు,  ప్రభాత్ కుమార్, చంద్రశేఖర్ గుప్తా, కోసూరు సుధాకర్ బాబు, సత్యం,  వెంకీ, వినోద్,  అబ్బాస్, బోనెల నాగేంద్ర, చిన్న, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *