రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన గిరిజన చిన్నారులు చెడ్డా.దీనా, డానియల్ లను పరామర్శించిన రాజన్నదొర గారు మరియు సాలూరు మండల వైసీపీ నేతలు.                                    తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర గారు.*                                                                                                      గత నెలలో అంపావల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం *సాలూరు మండలం కురుకుట్టి పంచాయితీ,చిన బారిగాం గ్రామ గిరిజన దంపతులు చెడ్డా.అప్పారావు(26సం.లు), వనిత(24 సం.లు) మరణించారు.వీరి పిల్లలు దీనా (5సం.లు),డానియల్(4సం.లు)క్షతగాత్రులయ్యారు.వారి పాప దీనాకు విశాఖ కేజీహెచ్ లో కుడి కాలుకు సర్జరీ జరిగింది.* వైద్యుల సలహాల మేరకు ఇంటి వద్ద చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు ఈరోజు సాలూరు మండలం, చినబారిగాం గ్రామం వెళ్లి భాధిత గిరిజన కుటుంబాన్ని  పరామర్శించారు.రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరి *చిన్నారులు దీనా,డేనియల్ లను చూసి చలించిపోయి భావోద్వేగానికి గురయ్యారు*.ఈ సందర్బంగా *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు భాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ క్షతగాత్రులైన పిల్లలు ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి దీనాకు సర్జరీ అయిన కాలును పట్టుకొని చూసారు.మీకు ఏ అవసరం వచ్చిన నన్ను సంప్రదించండి నేను మీకు అండగా ఉంటాను ధైర్యంగా ఉండండి అని ఓదార్చుతూ వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాయింట్ సెక్రటరీ బచ్చల.ప్రసాద్ రావు గారు, మన్యం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీనివాసరావు గారు,కురుకుట్టి ఎంపీటీసీ గెమ్మెల.సుబ్బు గారు,సర్పంచ్ వంతల.అప్పారావు గారు,వైస్ ప్రెసిడెంట్ సాంబ గారు,దండిగామ్ సర్పంచ్ ప్రతినిధి రాజారావు గారు, సారిక ఎంపీటీసీ ప్రతినిధి రాంబాబు గారు,వైసీపీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి