శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

●  *శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ●                                                            ఈరోజు సాలూరు మండలం *శివరాంపురం* గ్రామంలో నూతనంగా నిర్మించిన *శ్రీరామా నందనాద నామ దేయులు అభినవ యోగ సరస్వతి శ్రీ విద్యోపాపక ప్రముఖ నాడీ జ్యోతిష్కులు,శ్రీ విద్యా సర్వ మంగళ దేవీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ* గారిచే పూజా కార్యక్రమాలు *శివరామ ద్వారకామాయి ధ్యాన మందిర ప్రతిష్టా మరియు శ్రీ షిరిడిసాయి బాబా,శ్రీ వినాయక,శ్రీ దత్తాత్రేయ వారల విగ్రహ ప్రతిష్ట* కార్యక్రమంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* గారు పాల్గొని పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి.సురేష్ గారు, మణ్యం జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీను గారు,సర్పంచ్ మోహన్ గారు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ అర్చకులు తంపిల్ల.సీతారామా శాస్త్రీ గారు, మందిర నిర్మాణ వ్యవస్థాపక శాశ్వత ధర్మకర్తలు వసంతల సూర్యనారాయణ,సత్యవతి దంపతులు,గ్రామస్తులు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి