ఇంగ్లీష్ విద్య నేర్పిన గురువుకు తోటి కళాశాల స్నేహితులతో కలిసి సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన సమయంలో తనకు *ఇంగ్లీష్* పాఠాలు బోధించిన ఇంగ్లీషు లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్‌రావు

గారు శ్రీకాకుళంలో నివాసముంటున్నారనే విషయం తెలుసుకొని వారి దగ్గరకు ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు తోటి కళాశాల తరగతి స్నేహితులతో కలసి వెళ్లారు.ఈ సందర్భంగా వారి *ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు* గారితో చాలాసేపు మాట్లాడుతూ విద్యార్థి సమయంలో జరిగిన కళాశాల తీపి గుర్తులను,పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.తదనంతరం వారి గురువు గారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.తోటి స్నేహితులతో కలసి *ఇంగ్లీష్ లెక్చరర్* గారిని *రాజన్నదొర* గారు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారి కళాశాల స్నేహితులు కోటేశ్వరరావు గారు పుల్లయ్య గారు,స్వామినాయుడు గారు ఆయనతో పాటు ఉన్నారు.

 
            