చీపురుపల్లి పట్టణం కూరాకుల వీధిలో పెద్దచెరువు ని అనుకోని కూరాకుల వీధికి సంబందించిన ప్రజలు వర్షాకాలం లో ఇబ్బందులు పడుతున్న సమస్య ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, అనంత్ దృష్టిలో పెట్ట గా వెంటనే 4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసారు ఆ పనికి ఈ రోజు ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ శంకుస్థాపన చేసారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలు వర్షాకాలం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు అని, ఇళ్లల్లోకి కూడా నీళ్లు వస్తున్నాయి అని అందుకే వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి 4 లక్షల రూపాయలు తో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నామని, పనులు వెంటనే మొదలు పెట్టి తొందరగా పూర్తి చెయ్యాలని కోరారు, ఈ కార్యక్రమం లో ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,జిల్లా యువజన ఉపాధ్యక్షులు బెల్లాన వంశీ, ఎంపీటీసీ ప్రతినిధులు ఇప్పిలి గోవింద, ముల్లుపైడిరాజు ఎంపీటీసీ గిరిడి రామదాసు, మీసాల బాలు, అప్పికొండ అధిబాబు, వార్డుమెంబర్స్ కంచుపల్లి అశోక్, కరణం ఆది,సతివాడ అధికృష్ణ ,పాండ్రంకి వాసు, కంచుపల్లి రమేష్, లంకవలస నాగరాజు, నర్సింగ్, అప్పుడు ,శ్రీను,యువకులు పెద్దలు పాల్గొన్నారు.

